స్థానిక ఆలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు

JN: పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సోమవారం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు స్వామివారి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.