కారు బోల్తా వ్యక్తికి తీవ్ర గాయాలు
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కృష్ణం పాలెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డూ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రం గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి విజయవాడ వైపు వెళుతుండగా కారు అదుపుతప్పడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు క్షతగాత్రుని అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.