BREAKING: మరో బస్సు ప్రమాదం.. 17 మంది మృతి
TG: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ దగ్గర తాండూరు డిపో బస్సును టిప్పర్ ఢీ కొన్న ఘటనలో 17 మంది మృతి చెందారు. కంకర లారీ బస్సుపై వాలడంతో.. అందులోని కంకర బస్సులో పడింది. ఈ నేపథ్యంలో బస్సులోని ప్రయాణికులు కంకరలో చిక్కుకున్నారు. బస్సులో 40 మంది ఉన్నారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పోలీసులు బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తున్నారు. జేసీబీతో సహాయక చర్యలు చేపట్టారు.