ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్.. విద్యార్థి మృతి
NLR: బుచ్చి పట్టణంలోని ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చి బైక్ ఢీ కొట్టింది. ఈ ద్విచక్ర వాహనంలో ఉన్న ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలం చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.