VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో పల్సర్ బైక్ దగ్దం
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్‌తో పల్సర్ వాహనం దగ్దం అయిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. వాంకిడి జాతీయ రహదారిపై ఆసిఫాబాద్ వైపు పల్సర్ బైక్‌పై యువకుడు వెళ్తుండగా బైక్ నుంచి పొగలు రావడంతో వాహనదారుడు వెంటనే అప్రమత్తం అయి బైక్ దిగిపోయాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.