జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్న గంపప్రసాద్

KMR: పట్టణానికి చెందిన ప్రముఖ రక్తదాత, రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు గంప ప్రసాద్‌కు జాతీయస్థాయి పురస్కారం లభించింది. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా చేతుల మీదుగా ఆయన 'జాతీయ రక్తవీర్ పురస్కారం' అందుకున్నారు. ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలిపారు.