నేడు దివ్యాంగులకు వైద్య పరీక్షలు
NGKL: తీవ్ర అంగ వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు సోమవారం జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్పీఆర్డీ (NPRD) ఇండియా నేత రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. కండరాల బలహీనత, వెన్నెముక సమస్యలున్న వారు ఉదయం 9:30 గంటలకు హాజరు కావాలని కోరారు. వచ్చే వారు తమ వెంట ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, మెడికల్ రిపోర్టులు తీసుకరావాలని తెలిపారు.