ప్రొద్దుటూరులో మున్సిపల్ కమిషనర్ తనిఖీలు

KDP: ప్రొద్దుటూరులో మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి గురువారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. డ్రైనేజీ కాల్వల్లోని వ్యర్థాలను, రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే పనులు చేపట్టారు. ఈ మేరకు టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల అధికారులను సమన్వయ పరచి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కాగా, నిన్నటి నుంచి కాల్వలన్నీ వ్యర్థాలతో నిండిపోయాయి.