కొత్త అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం
ATP: కళ్యాణదుర్గం పట్టణంలో 40 ఏళ్లుగా స్వంత భవనం కోసం నిరీక్షించిన అగ్నిమాపక కేంద్రం భూమి పూజను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో 2.25 కోట్ల రూపాయలతో కొత్త అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని తెలిపారు.