అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
MHBD: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కురవి మండలం నారాయణపురంలో చోటుచేసుకుంది. పాత తండాకు చెందిన భూక్యా జామ్లా( 58) అనే రైతు తన ఎకరం 10 గుంటలతో పాటు, మరికొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అయితే పంట దిగుబడి తక్కువ రావడంతో పెట్టుబడిగా తెచ్చిన అప్పు తీర్చే మార్గం లేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.