పంచాయతీ కార్యదర్శులకు BIG SHOCK
TG: పంచాయతీ కార్యదర్శుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో గ్రేడ్-5 నుంచి గ్రేడ్-3 హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ జారీ చేసిన జీవో 91 ప్రకారం వీరికి రూ.28,280 పేస్కేల్‌ను నిర్ణయించారు. తాజాగా ప్రభుత్వం ఆ ఉత్తర్వులను సవరించి.. జీవో 60ని విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్‌ను రూ.28,280 నుంచి రూ.25,220కి తగ్గించింది.