VIDEO: గుంతలతో రోడ్డు మార్గం
SKLM: ఎల్‌ఎన్ పేట మండలం బొర్రంపేట వద్ద అధ్వానంగా రోడ్డు మార్గం తయారయిందని వాహనదారులు అంటున్నారు. ఈ గుంతల వలన రాత్రి సమయంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి గుంతలను పూడ్చి పెట్టాలని కోరుతున్నారు.