'మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి'
GNTR: యువత గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు, పేకాట వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పొన్నూరు అర్బన్ సీఐ వీరా నాయక్ సూచించారు. పొన్నూరులో నిడుబ్రోలు టిడ్కో గృహాలలో సోమవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. కాలనీలో అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 100, 112పై అవగాహన కల్పించారు.