పంటల నిర్వహణపై రైతులకు అవగాహన
SKLM: ఆమదాలవలస మండలం కొర్లకోటలో మండల వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావు ఆధ్వర్యంలో 'రైతన్న మీ కోసం' కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. పంటల నిర్వహణ, ఎరువుల వినియోగం, విత్తనాల పంపిణీ, పంట బీమా వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించారు.