రాష్ట్రపతి నిలయానికి సందర్శనాలు రద్దు
HYD: భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా ఈనెల 17 నుంచి నగరంలోని రాష్ట్రపతి నిలయంలో బసచేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 11 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రపతి నిలయం సందర్శనాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం శీతాకాలంలో రాష్ట్రపతి, కుటుంబసభ్యులు నగరంలో బస చేయడం ఆనవాయితీ.