బధిరుల పాఠశాలలో మంచాలు పంపిణీ
బాపట్ల మండలం వెదుళ్ళపల్లిలోని బదిరుల పాఠశాలలో రూ. 6 లక్షల విలువైన 90 మంచాలను బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పంపిణీ చేశారు. శనివారం పాఠశాలను సందర్శించిన ఆయన మంచాలను అందజేశారు. పాఠశాలల విద్యార్థులకు అవసరమైన మంచాలను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.