పత్తి కొనుగోలు KAPAS యాప్ ద్వారా జరుగుతుందని: ఏవో
VKB: బషీరాబాద్ మండలంలో పత్తి కొనుగోలు ప్రక్రియ KAPAS యాప్ ద్వారా జరుగుతుందని మండల AO అనిత తెలిపారు. రైతులు ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకొని తమ మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె సూచించారు. రైతులు నేరుగా యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని, పత్తిని విక్రయించుకునేందుకు అవకాశం ఉందని వివరించారు.