దారి తప్పి ఇంట్లోకి వచ్చిన జింక

నంద్యాల: గోస్పాడు మండలం సాంబవరం గ్రామంలోకి దారి తప్పి జింక ఇంట్లోకి వచ్చింది. గురువారం తెల్లవారుజామున అడవిలో నుండి పొలాలు దాటుకొని అదుపుతప్పి గోస్పాడు మండలం సాంబవరం గ్రామంలో ఓ ఇంట్లోకి రావడంతో జింకను తప్పిపోకుండా కట్టేసి వారు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు జింకను తీసుకొని అడవిలో వదిలిపెట్టారు.