VIDEO: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జల్లేరు వాగు

ELR: జంగారెడ్డిగూడెం మండలం పట్టేన్నపాలెం గ్రామంలో జల్లేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు కొండ వాగులు పొంగిపొర్లడంతో ఏజెన్సీలోని చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కల్వర్టల పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో కాలువల వద్ద పోలీసులు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పరిస్థితి తీవ్రంగా మారింది.