పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

MDK: చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో వ్యవసాయ పంటలను జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ పరిశీలించారు. గుర్తింపు లేని కంపెనీ నుంచి 4547 రకం వరి విత్తనాలను 40 మంది రైతులు సాగు చేయగా.. పంట సరిగా రాకపోవడంతో వ్యవసాయ అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం జిల్లా వ్యవసాయ అధికారి పంటలను క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్టు నివేదికను తయారు చేసినట్లు రైతులు పేర్కొన్నారు.