'దాడి చేసిన వారిని శిక్షిస్తాం'

KDP: తొండూరు మండలం ఇనగలూరుకు చెందిన ఇరువర్గాల ఘర్షణపై పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇనగలూరు నుంచి హరి కిషోర్ రెడ్డి, సమరసింహారెడ్డి బైకులో వస్తుండగా, వారిపై కొంత మంది దాడి చేయగా తలకు బలమైన గాయాలయ్యాయన్నారు. బాధితులతో కంప్లైంట్ తీసుకొని దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.