రేపు కౌతాళంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పర్యటన

KRNL: కౌతాళం గ్రామంలో రేపు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పర్యటించనున్నారు. ప్రభుత్వం చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కౌతాళం గ్రామంలో ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. ఎమ్మెల్యే పర్యటనలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వైసీపీ నాయకులు కోరారు.