VIDEO: ఘనంగా దత్తాత్రేయ పల్లకి ఊరేగింపు
ADB: భోరజ్ మండలం బాలాపూర్ గ్రామంలో గురువారం దత్త జయంతిని పురస్కరించుకొని దత్తాత్రేయ పల్లకి ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో భజన కీర్తనలు పాడుతూ, దత్తనామస్మరణతో పల్లకీ ఊరేగింపు చేపట్టారు. ఈ వేడుకల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు.