ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్జీకర్ అత్యాచార బాధితురాలి తల్లి

ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్జీకర్ అత్యాచార బాధితురాలి తల్లి

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 19 మంది అభ్యర్థులతో కూడిన మరో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో బెంగాల్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆర్జీకర్ అత్యాచార కేసు బాధితురాలి తల్లికి ఎమ్మెల్యే అభ్యర్థిగా కమలం పార్టీ అవకాశం కల్పించింది. పానిహతి నియోజకవర్గం నుంచి ఆమె బరిలో దిగనున్నట్లు ప్రకటించింది. తనకు MLA టికెట్ ఇవ్వాలని ఆమె కోరిన విషయం తెలిసిందే.