వైభవంగా జరుగుతున్న స్వయంబేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
CTR: సోమలలో శ్రీ పార్వతి దేవి సమేత స్వయంబేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, అర్చకులు నిర్వహించారు. భక్తులు పరమేశ్వరుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతిరోజు పార్వతీ పరమేశ్వరులకు గ్రామోత్సవం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.