రాజంపేట గ్రామసభలో పాల్గొన్న MLA
ASF: ఆసిఫాబాద్ మండలంలోని రాజంపేట గ్రామ పంచాయతీలో గురువారం నిర్వహించిన "99 రోజుల కార్యాచరణ ప్రణాళిక" కార్యక్రమంలో MLA కోవ లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పారిశుద్ధ్యం, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజల సమస్యల పరిష్కారంపై ఆమె అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మామిడి లక్ష్మి, వార్డ్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.