52 రోజులు చేరిన దళిత రైతులు నిరసన

AKP: రాయి క్వారీని రద్దు చేయాలని మాకవరపాలెం మండలం జీ. కోడూరు దళిత రైతులు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద చేస్తున్న నిరసన కార్యక్రమం శుక్రవారం నాటికి 52వ రోజుకు చేరింది. తమ జీవనాధారమైన భూములను నాశనం చేస్తున్న రాయి క్వారీని రద్దు చేయాలని 52 రోజులుగా నిరసనలు చేస్తుంటే అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని వాపోయారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరారు.