VIDEO: ఏసీబీ రైడ్స్.. తాళం చెవిని విసిరేసిన TPO
VZM: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాష్ రూమ్ కోసం బయటకు వెళ్లిన టౌన్ ప్లానింగ్ అధికారి తాళం చెవిని కిందకి విసిరేశాడు. వెంటనే గమనించిన అధికారులు తాళం చెవిని స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చేయాలని టీపీవో కోరగా, అధికారులు నిరాకరించారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.