మృతి చెందిన పారిశుధ్య కార్మికుడికి కుటుంబానికి న్యాయం చేయాలి

W.G: ఇటీవల కొప్పర్రులో విద్యుత్ ఘాతంతో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు చంద్రపాల్ కుటుంబానికి ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని పంచాయితీ పారిశుద్ధ కార్మికుల జిల్లా అధ్యక్షులు బంగారు కృష్ణ డిమాండ్ చేశారు. పంచాయితీ పారిశుద్ధ్య కార్మికుల రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.