పాలకుర్తి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన DCP

JN: పాలకుర్తి మండలంలోని పోలీస్ స్టేషన్‌ను వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ శుక్రవారం వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన రికార్డులను పరిశీలించి, కిట్ ఇన్‌స్పెక్షన్, పరేడ్, లాఠీ డ్రిల్ నిర్వహించారు. అనంతరం స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఇంకుడుగుంత, లాన్ గ్రాస్ గార్డెన్‌ను ప్రారంభించారు. కార్యాక్రమంలో సీఐ జానకిరామ్ , పోలీస్ సిబ్బంది ఉన్నారు.