'కిల్లర్'.. ఐదు పాత్రల్లో జ్యోతి పూర్వజ్
జ్యోతి పూర్వజ్, మనీష్ గిలాడ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం 'కిల్లర్'. ఈ సినిమా దర్శకుడు పూర్వజ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో జ్యోతి పూర్వజ్ స్పై, వాంపైర్ సహా ఐదు విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించిందని తెలిపాడు. ఇది ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ అని వెల్లడించాడు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ చిత్రం 'టాక్ ఆఫ్ ది టౌన్'గా మారుతుందని ధీమా వ్యక్తం చేశాడు.