భువనగిరి కోటలోకి నేడు ఫ్రీ ఎంట్రీ

భువనగిరి కోటలోకి నేడు ఫ్రీ ఎంట్రీ

BHNG: ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ తీపి కబురు అందించింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలు, చారిత్రక కట్టడాలకు ఉచిత ప్రవేశం కల్పించింది. భువనగిరిను సందర్శకులు ఇవాళ ఉచితంగా చూడవచ్చు. మన వారసత్వ సంపదపై ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే ప్రభుత్వం ఈ గొప్ప అవకాశం కల్పించింది.