కాలు దువ్విన పందెం కోళ్లు

కాలు దువ్విన పందెం కోళ్లు

ప్రకాశం: సంక్రాంతి పర్వదినం సందర్భంగా జిల్లాలో పలు చోట్ల పందెం కోళ్లు కాలు దువ్వాయి. బల్లికురం మండలంలోని మల్లయపాలెం గ్రామానికి కొరిశపాడుమార్టూరు సంతమాగులూరు అద్దంకి చిలకలూరిపేట ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చారు. గత రెండు రోజులుగా గరిడీలు మారుస్తూ పందాలు నిర్వహిస్తున్నారు దాదాపు రూ.30 లక్షలకు పైగా పందాలు జరిగినట్లు స్థానికులు తెలిపారు.