కోటవురట్లలో కురుస్తున్న మంచు

కోటవురట్లలో కురుస్తున్న మంచు

అనకాపల్లి: కోటవురట్లతో పాటు చుట్టుపక్కల గ్రామంలో బుధవారం ఉదయం మంచు కురుస్తుంది. వాతావరణం చల్లబడడంతో పాటు కురుస్తున్న మంచు వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా పడిన నేపథ్యంలో శీతాకాలంలో మంచు ఎక్కువగా కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం పూట వాతావరణం చల్లగా ఉంటున్నా మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.