బ్రిడ్జి మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

బ్రిడ్జి మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి: జిల్లా వలిగొండ మండల కేంద్రం నుండి చిట్యాల వెళ్లే రహదారిపై మూసి బ్రిడ్జి మరమ్మతులు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.