నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రాక
KMR: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఇవాళ బిక్కనూర్‌కు రానున్నట్లు కౌసల్యా దేవి ఫౌండేషన్ అధ్యక్షుడు జ్ఞాన ప్రకాశ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఫౌండేషన్ నిర్మించిన మధ్యాహ్న భోజన పథకం షెడ్డును ఆయన ప్రారంభిస్తారు. అలాగే, బాలుర పాఠశాలలో నిర్మించనున్న షెడ్డుకు శంకుస్థాపన చేస్తారని ఆయన పేర్కొన్నారు.