'ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు'

ELR: ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రానుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ఐదు కేటగిరీల బస్సుల్లో బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు తగిన గుర్తింపు కార్డు చుపించి ప్రయాణించవచ్చని తెలిపారు.