శబరిమల భక్తులకు శుభవార్త

శబరిమల భక్తులకు శుభవార్త

శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలకు మరో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన రైల్వే టికెట్ల బుకింగ్ డిసెంబర్ 3 నుంచి ప్రారంభంకానున్నట్లు చెప్పింది. ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులను డిసెంబర్ 13 నుంచి 31 మధ్య వివిధ తేదీల్లో నడపనున్నట్లు తెలిపింది.