బండి సంజయ్ వ్యాఖ్యలపై చామల ఫైర్
TG: కేంద్ర మంత్రి అనే హోదాను మర్చిపోయి మాట్లాడటం బండి సంజయ్‌కు అలవాటు అయిందని MP చామల కిరణ్ కుమార్ విమర్శించారు. 'హిందువులంతా ఏ పార్టీలో ఉన్నా BJPలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది అని మాట్లాడటం సరైంది కాదు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి MPగా ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక జరిగితే BJP డిపాజిట్ గల్లంతైంది. BJP లోపాయికారిగా BRSకు మద్దతు ఇచ్చిందా? అని ప్రశ్నించారు.