కేశవదాసుపురంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం
SKLM: పొందూరు మండలం కేశవదాసుపురంలో నూతనంగా జాతీయ ఉపాధి హామీ పథకం రూ.9,90,000ల అంచనాలతో టీడీపీ నేత, మాజీ సర్పంచ్ నారాయణ రావు గురువారం ప్రారంభించారు. ఉపాధి పథకంలో ప్రతి ఒక్క వేతనదారుకు 125 పని దినాలు కల్పించనున్నట్లు తెలిపారు. చెరువులు మెరుగుపరచి సాగునీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి కూలీలు ఉన్నారు.