డిప్యూటీ సీఎం కోలుకోవాలని ప్రత్యేక పూజలు

డిప్యూటీ సీఎం కోలుకోవాలని ప్రత్యేక పూజలు

అన్నమయ్య: పెనగలూరు మండలం ఓబిలి గ్రామంలోని ఆంజనేయ దేవాలయంలో ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాయకులు, అభిమానులతో కలిసి పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.