'వ్యూహాత్మక అంతరిక్ష కేంద్రంగా హోదా కల్పించాలి'

KKD: ఏపీకి వ్యూహాత్మక అంతరిక్ష కేంద్రంగా హోదా కల్పించాలని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్‌కు ఆంధ్ర ప్రదేశ్ ఎంపీలు వినతి పత్రాన్ని అందజేశారు. బుధవారం న్యూఢిల్లీలో టెక్నాలజీ భవన్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్‌ను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నేతృత్వంలో ఎంపీల బృందం కలిశారు.