మంత్రి ఉత్తమ్ నేటి పర్యటన వివరాలు
NLG: రాష్ట్ర సాగునీటి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం నల్గొండ ఐడీఓసీలో "ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక” 99 రోజుల యాక్షన్ ప్లాన్ సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. అనంతరం హుజూర్ నగర్ రామస్వామి గుట్టలో 2160 ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. తర్వాత దొండపాడు జాతరలో పాల్గొననున్నారు.