టీడీపీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు
బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలోని TDP కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచనలతో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సోదరులు అనగాని శివప్రసాద్ మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు.