మానవపాడు రైల్వే అండర్ పాస్ వద్ద మళ్లీ వర్షపు నీరు

GDWL: మానవపాడు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిల కింద సోమవారం మరోసారి వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చిన్నపాటి వర్షానికే ఈ పరిస్థితి తలెత్తడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచించారు.