మిర్యాలగూడ నుంచి పంచరామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు
NLG: మిర్యాలగూడ డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్ పంచరామ శివక్షేత్రాల దర్శనానికి ఈ నెల 16నుంచి ప్రారంభమవుతుందని DM రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ బస్సు అమరారం, సోమారామం, క్షీరారామం, ద్రాక్షారామం, కుమార రామం దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు DM చెప్పారు. పెద్దలకు 1800, పిల్లలకు 1100 రూపాయల టికెట్ ధర ఉంటుందని, మరిన్ని వివరాలకై 9502502357కు సంప్రదించాలన్నారు.