సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ భద్రతా ఏర్పాట్ల పరిశీలన
విశాఖ: ఈ నెల 14, 15 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ కోసం నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి మంగళవారం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దేశ, విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల కోసం నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు.