'ట్రంప్ జలసంధి'.. అదే హర్మూజ్: ట్రంప్
ఇరాన్‌ను ఉద్దేశంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 'ప్రస్తుతం మేం చర్చలు జరుపుతున్నాం. వాటి నుంచి ఏదైనా సానుకూల ఫలితం వస్తే బాగుంటుంది. కానీ వాళ్లు ట్రంప్ జలసంధిని తెరవాలి. అదే అదే హర్మూజ్. అయ్యో.. నేను పెద్ద పొరపాటు చేశా. క్షమించండి' అంటూ మాట్లాడారు. మళ్లీ వెంటనే 'పొరపాటున ట్రంప్ జలసంధి అన్నానని.. అలాంటి పొరపాట్లేం ఉండవు' అని పేర్కొన్నారు.