యువతి మృతిలో ట్విస్ట్..!
తిరుపతిలో ఐదో అంతస్తు నుంచి పడి యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త విషయాలను పోలీసులు వెల్లడించారు. మొదటగా రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు పడినట్లు భావించిన విచారణలో ఆత్మహత్యగా తేలిందన్నారు. వివరాల ప్రకారం.. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పేర్కొన్నారు. వరుసకు సోదరుడయ్యే యువకుడిని ప్రేమించిన పుష్పను తల్లి మందలించడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు.