తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టండి: ఛైర్మన్
CTR: వేసవి సమీపిస్తున్న దృశ్య పట్టణంలో త్రాగునీటి సమస్య రాకుండా ముందస్తు తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ భాష అధికారులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం పుంగనూరు పురపాలక పాలకవర్గ చివరి సమావేశం జరిగింది. అజెండాలోని తొమ్మిది అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇంతకాలం తమ పాలక వర్గానికి సహకారం అధికారులకు ఛైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.